రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఇలాగే రెండు గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాబట్టి నగర ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. ఇదిలా ఉంటే.. నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులను తాకాయి. బంగాళాఖాతంలో చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు.. మరిన్ని ప్రాంతాల్లోకి విస్తరించనున్నాయి. ఈ నెల చివరి వరకు కేరళను తాకి, జూన్ 8 నుంచి 11 మధ్య తెలంగాణలోకి ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.