సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా విరాట్ కోహ్లీపై ప్రశంసలు కురిపించారు. తన మండే మోటివేషన్‌లో..‘‘పొరపాట్లు చేసినప్పుడు వాటిని సరిదిద్దుకుని తిరిగి పైకి లేచే వ్యక్తులపై మా కంపెనీ విశ్వాసంగా ఉంటుంది. అలాంటివారిని మేం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తాం.. అభినందిస్తాం. ఈ మండే మోటివేషన్‌లో కోహ్లీ, బెంగళూరు కంటే మించి మనకు స్ఫూర్తి కలిగించేవారు ఇంకెవరున్నారు?’’ అని పోస్ట్ చేశారు.