Homeహైదరాబాద్latest NewsIPL-2024: నాకౌట్ మ్యాచ్‌ల స్పెషల్ పోస్టర్.. అదిరిపోయిందిగా..!

IPL-2024: నాకౌట్ మ్యాచ్‌ల స్పెషల్ పోస్టర్.. అదిరిపోయిందిగా..!

ఐపీఎల్ టోర్నీలో లీగ్ దశ ముగియడంతో రసవత్తరంగా సాగే నాకౌట్ మ్యాచ్‌లు వీక్షించేందుకు ఫ్యాన్స్ సిద్ధమయ్యారు. రేపు క్వాలిఫయర్-1 జరగనుంది. ఈనెల 22న ఎలిమినేటర్, 24న క్వాలిఫయర్-2 జరగనుండగా.. మే 26న ఫైనల్ మ్యాచ్ ఉండనుంది. దీనికి సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను ఐపీఎల్ తన ట్విటర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఫైనల్ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఈ నెల 21, 22 తేదీల్లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరగడం గమనార్హం. అయితే ఈ రెండు రోజుల్లో అహ్మదాబాద్‌లో వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షం కారణంగా క్వాలిఫయర్ 1 మ్యాచ్ సాధ్యం కాలేదనుకోండి.. అప్పుడు కేకేఆర్ ఫైనల్స్‌లోకి ప్రవేశిస్తుంది. ఎందుకంటే పాయింట్ల పట్టికలో కేకేఆర్ జట్టు అగ్రస్థానంలో ఉంది. ఇదిలా ఉంటే ఎలిమినేటర్ మ్యాచ్ రద్దయితే రాజస్థాన్ రాయల్స్ జట్టు ముందుకెళ్తుంది.

Recent

- Advertisment -spot_img