Homeహైదరాబాద్latest Newsకాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు..ఎందుకంటే?

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసిన బీఆర్ఎస్ నాయకులు..ఎందుకంటే?

ఇదే నిజం, గొల్లపల్లి: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ 500 ఇస్తానన్న వాక్యాలకు నిరసనగా తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశానుసారం అన్ని రకాల వడ్లకు బోనస్ 500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్వర్యంలో జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని మండల కార్యాలయం ముందు ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేసి నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.గొల్లపల్లి జడ్పీటీసీ గోస్కుల జలందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం.. దగా.. నయవంచన..గ్యారెంటీ కార్డులో.. “వరిపంటకు” రూ.500 బోనస్ అని ప్రకటించి.. ఇప్పుడు “సన్న వడ్లకు మాత్రమే” అని సన్నాయి నొక్కులు నొక్కుతారా ??ప్రచారంలో ప్రతి గింజకు అని ఊదరగొట్టి..ప్రభుత్వంలోకి రాగానేచేతులెత్తేస్తారా ?? ఇది ప్రజా పాలన కాదు.. రైతు వ్యతిరేక పాలన నిన్నటిదాకా సాగునీరు ఇవ్వక సావగొట్టారు.. కరెంట్ కోతలతో పంటలను ఎండగొట్టారు.. కష్టించి పండించిన ధాన్యాన్ని కొనకుండా అకాల వర్షాలపాలు చేసి ఆగం చేశారు.. ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులకు రూ.15 వేలు రైతుభరోసా అన్నారు .. ఇవ్వలేదు.వ్యవసాయ కూలీలకు రూ.12000 వేలు అన్నారు.. వేయలేదు. ప్రతి రైతుకు డిసెంబర్ 9నే..రెండు లక్షల రుణమాఫీ అన్నారు.. చేయలేదు నేడు బోనస్ విషయంలో కూడా ప్రభుత్వ బోగస్ విధానాన్ని బయటపెట్టారు. ఓట్ల నాడు ఒకమాట…నాట్ల నాడు మరోమాట చెప్పడమే కాంగ్రెస్ నైజం అసెంబ్లీ ఎన్నికల్లో గాలిమాటలతో గారడీ చేసింది.. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు డబ్బాలో పడగానే.. నాలుగు కోట్ల ప్రజల సాక్షిగా తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది.. కాంగ్రెస్ సర్కారు ఎద్దేడ్సిన యవుసం..రైతేడ్చిన రాజ్యం నిలబడదు.. నమ్మి ఓటేసినందుకు.. రైతుల గొంతు కోసిన కాంగ్రెస్ సర్కారును అన్నదాతలు ఇక వదిలిపెట్టరు.. పల్లె పల్లెనా ప్రశ్నిస్తారు.. తెలంగాణ వ్యాప్తంగా నిలదీస్తారు..కపట కాంగ్రెస్ పై సమరశంఖం పూరిస్తారు. నేటి నుంచి రైతన్నల చేతిలోనే కాంగ్రెస్ సర్కారుకు కౌంట్ డౌన్ షురూ.. అయింది అన్నారు..

ఈ నిరసన కార్యక్రమంలో జడ్పీటీసీ గోస్కుల జలందర్,BRS పార్టీ మండల కోఆర్డినేటర్ బోయపోతు గంగాధర్,ప్యాక్స్ వైస్ చైర్మన్ నవ్వా తిరుపతి,పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మరాంపెళ్లి బాబు,ప్యాక్స్ డైరెక్టర్ కచ్చు కొమురయ్య,మండల అనుబంధ సంఘాల అధ్యక్షులు బలభక్తుల కిషన్, సామల వీరస్వామి,అవారి చందు,మ్యాదరి రమేష్,BRS పార్టీ మండల మీడియా కన్వీనర్ కోమల్ల జలందర్, ఎంపీటీసీలు చింతం అశోక్, గోవిందుల లావణ్య జలుపతి, గోలి లక్ష్మిగంగారెడ్డి,తూర్పాటి రవి నాయకులు మారం రాజశేఖర్,కనుకుట్ల లింగారెడ్డి, ఒరగంటి అశోక్ రావ్,సిద్దంకి మల్లారెడ్డి,రత్నం,కనుకుట్ల లింగారెడ్డి,కూన రాజేందర్,బత్తిని సత్తన్న,బొల్లం గంగరాజం,కడమండ వెంకన్న,దావుల రాకేష్,తాండ్ర కిరణ్,కలికోట సత్యం,రవి, భూమన్న,గోపాల్ రావ్,సత్యం రావ్,రాజ్ కుమార్,మహేష్ మరియు ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img