Homeహైదరాబాద్latest Newsధోనికి సర్జరీ. ఆ తర్వాతే రిటైర్మెంట్‌పై నిర్ణయం

ధోనికి సర్జరీ. ఆ తర్వాతే రిటైర్మెంట్‌పై నిర్ణయం

ఈ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై కాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. విజయానికి కొద్ది దూరంలోనే చెన్నై నిలిచిపోయి టోర్నీ నిష్క్రమించింది. దీనిపై ధోనీ కూడా కలత చెందాడు. మ్యాచ్ అనంతరం ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే డ్రెస్సింగ్ రూంకు వెళ్లాడు. అయితే ఈ సీజన్‌లో చాలా మ్యాచుల్లో ధోని ఇబ్బందికరంగా కనిపించాడు. తొడ కండరాల నొప్పితో బాధపడ్డాడు. మరో ప్రత్యామ్నాయ కీపర్ కాన్వే కూడా అందుబాటులో లేకపోవడంతో ధోనీ మీదే భారం పడింది. జట్టు ప్రయోజనాల కోసం తాను చెమటోర్చాడు. బాధను ఓర్చుకుంటూ ఎన్నో మ్యాచులు ఆడాడు. టోర్నీ నుంచి నిష్క్రమించిన తర్వాత సీఎస్‌కే టీం నుంచి ఓ సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ధోనీ శస్త్ర చికిత్స కోసం లండన్ వెళ్లనున్నట్లు టీం వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ తర్వాత కోలుకోవడానికి 5 నుంచి 6 నెలల సమయం పడుతుందని చెప్పాయి. ఆ తర్వాత ఆరోగ్య పరిస్థితులను బట్టి తన రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకుంటాడని పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img