Homeహైదరాబాద్latest Newsఆ బాలుడికి స్టేషన్‌లో బిర్యానీ, పిజ్జా

ఆ బాలుడికి స్టేషన్‌లో బిర్యానీ, పిజ్జా

మమారాష్ట్రలోని పుణెలో జరిగిన కార్ యాక్సిడెంట్‌లో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ప్రముఖ వ్యక్తి కొడుకు అయినందునే పోలీసులు స్పెషల్‌గా ట్రీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అతనికి పిజ్జా, బిర్యానీ అందించినట్లు పలు కథనాలు వచ్చాయి. ఆదివారం (మే 21) న ఓ బైక్‌ను లగ్జరీ కారు ఢీకొట్టింది. బైక్‌పై వెళ్తోన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవ్ చేసింది మైనర్ అని గుర్తించిన పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి కావాల్సిన ఆహారాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో నిందితుడికి 15 గంటల్లోనే బెయిల్ రావడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 300 పదాల్లో ప్రమాదంపై వ్యాసం రాయాలని, 15 రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో పని చేయాలంటూ న్యాయస్థానం చెప్పడం గమనార్హం.

Recent

- Advertisment -spot_img