16 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ 9 వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది.
కేకేఆర్‌తో జరుగుతోన్న మ్యాచ్‌తో సన్‌రైజర్స్ తడబడుతోంది. 13 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. పవర్ ప్లేలో మిచెల్ స్టార్క్ నిప్పులు చెరిగే బంతులు విసురుతూ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు. 3 ఓవర్లలో 22 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి కోలుకోలేని దెబ్బ తీశాడు.
ఆ తర్వాత వచ్చిన క్లాసీన్ త్రిపాఠితో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ కలిసి హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ప్రమాదకరంగా కనిపిస్తోన్న క్లాసీన్ బౌండరీకి ట్రై చేసి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.