Homeఫ్లాష్ ఫ్లాష్IPL-2024: శ్రేయస్ ఖాతాలో ఆల్‌టైమ్ రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడుగా…!

IPL-2024: శ్రేయస్ ఖాతాలో ఆల్‌టైమ్ రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్కడుగా…!

IPL-2024లో టేబుల్ టాపర్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ ఫైనల్‌కు చేరుకుంది. అహ్మదాబాద్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన క్వాలిఫయర్-1 మ్యాచ్ లో కేకేఆర్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఐపీఎల్‌లో ఫైనల్‌కు చేరడం కోల్‌కతాకు ఇది నాలుగోసారి. అయితే కోల్‌కతా నైట్ రైడర్స్ ను తుది పోరుకు అర్హత సాధించిన ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అరుదైన రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో రెండు ఫ్రాంచైజీలను ఫైనల్‌కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్‌గా శ్రేయాస్ చరిత్ర సృష్టించాడు. IPL 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను శ్రేయాస్ ఫైనల్‌కు చేర్చాడు. ఢిల్లీ ఫ్రాంచైజీ చేతులెత్తేయడంతో కేకేఆర్‌లోకి వచ్చిన శ్రేయాస్ మరోసారి తన కెప్టెన్సీ మార్క్ చూపించాడు.

Recent

- Advertisment -spot_img