Homeహైదరాబాద్latest NewsIPL-2024: సెలబ్రేషన్స్‌‌ తో కప్ గెలవలేరు.. ఆర్సీబీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అంబటి రాయుడు

IPL-2024: సెలబ్రేషన్స్‌‌ తో కప్ గెలవలేరు.. ఆర్సీబీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అంబటి రాయుడు

IPL-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది. ఈ సీజన్ లో ఒక దశలో RCB మొదటి ఎనిమిది మ్యాచ్‌లలో కేవలం ఒక విజయాన్ని మాత్రమే సాధించింది. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. వరుసగా ఆరు గెలిచి ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. కానీ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో 17 ఏళ్ల కప్ కల మరోసారి కలగానే మిగిలిపోయింది. అయితే ఆర్సీబీ ఓటమిపై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు విమర్శలు గుప్పించాడు. సంబరాలు, దూకుడు తో ఐపీఎల్ ట్రోఫీలను గెలవలేరని అన్నాడు. లక మ్యాచ్‌ల్లో విజయం సాధించాలని ఎద్దేవా చేశాడు. ప్లేఆఫ్‌కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సీఎస్‌కేపై ఆర్సీబీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. విజయం అనంతరం అభిమానులతో పాటు ఆర్సీబీ జట్టు ఘనంగా సంబరాలు చేసుకుంది. దీన్ని ఉద్దేశిస్తూ రాయుడు ఆర్సీబీని ట్రోల్ చేశాడు.

Recent

- Advertisment -spot_img