ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. చెన్నైలోని చెపాక్ మైదానంలో శుక్రవారం జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం చెపాక్ వేదికగా జరిగే టైటిల్ పోరులో కేకేఆర్ తో తలపడనుంది. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-1లో కేకేఆర్ చేతిలో ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు చెపాక్ మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ సాధించిన రికార్డు ఆ జట్టు అభిమానులను కలవరపెడుతోంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ వికెట్ పై ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడగా ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. 8 మ్యాచ్ ల్లో ఓడిన సన్ రైజర్స్ హైదరాబాద్.. ఒక మ్యాచ్ టై అయింది. ఈ రికార్డులు చూసి సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. చెపాక్ వికెట్ నెమ్మదిగా ఉంది మరియు స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో టాప్ స్పిన్నర్ లేకపోవడం కలవరపెడుతున్న అంశం. వాణిందు హస్రంగ స్థానంలో వచ్చిన విజయకాంత్ వ్యాస్కాంత్ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. ఈ క్రమంలో అతని స్థానంలో ఐడెన్ మార్క్రామ్ లేదా గ్లెన్ ఫిలిప్స్ బరిలోకి దిగనున్నారు. లోకల్ బాయ్ వాషింగ్టన్ సుందర్ తుది జట్టులో ఆడే అవకాశం ఉంది.