ఐపీఎల్ 2024 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్ ఫైనల్ చేరడం హైదరాబాద్ ఫ్రాంఛైజీకి ఇది నాలుగోసారి. 2009, 2016లో టైటిల్ గెలిచిన ఆ జట్టు 2018లో ఫైనల్లో ఓడింది. అయితే ఇందులో మూడు సందర్భాల్లో ఆస్ట్రేలియా క్రికెటరే హైదరాబాద్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నారు. ఇంతకుముందు గిల్‌క్రిస్ట్ (డెక్కన్ ఛార్జర్స్- 2009), వార్నర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్-2016) కెప్టెన్లుగా ఉన్నారు. ఇప్పుడు కమిన్స్ జట్టుకు సారథి గా ఉన్నాడు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ అరుదైన రికార్డు సాధించాడు. ఒకే ఐపీఎల్ సీజన్లో కెప్టెన్‌గా అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడు పాట్ కమిన్స్ నిలిచాడు. ఐపీఎల్ 17వ సీజన్లో ఇప్పటికి 17 వికెట్లు తీశాడు. 2008లో రాజస్థాన్ సారథిగా షేన్ వార్న్ (19) వికెట్లు తీశాడు.. మరో రెండు వికెట్లు తీస్తే వార్న్‌ను కమిన్స్ అధిగమిస్తాడు.