Homeహైదరాబాద్latest NewsIPL Final 2024: ఐపీఎల్ ఫైనల్ వేళ.. పందాల జోరు..!

IPL Final 2024: ఐపీఎల్ ఫైనల్ వేళ.. పందాల జోరు..!

ఐపీఎల్-2024 సీజన్ చివరి పోరుకు రంగం సిద్ధమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ టైటిల్‌ను నేడు నిర్ణయించనున్నారు. బలాబలాలతో సమానంగా ఉన్న ఇరు జట్లు ఫైనల్‌లో ఫేవరెట్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో చేపాక్ వేదికగా జరగనున్న ఈ హైవోల్టేజీ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కానీ గణాంకాల పరంగా చూస్తే సన్‌రైజర్స్‌పై కేకేఆర్‌దే పైచేయి. ఈ సీజన్‌లోనే కాకుండా ఓవరాల్‌గా ఐపీఎల్‌లో SRHపై కోల్‌కతా మెరుగైన రికార్డును కలిగి ఉంది. ఈ సీజన్‌లో ఇరు జట్లు రెండు సార్లు తలపడ్డాయి. రెండింటిలోనూ కోల్‌కతా విజయం సాధించింది. సన్‌రైజర్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో కేకేఆర్ నాలుగు పరుగులతో, క్వాలిఫయర్-1లో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఐపీఎల్‌లో ఇరు జట్లు మొత్తం 27 మ్యాచ్‌లు ఆడగా, కోల్‌కతా మూడింట రెండు మ్యాచ్‌లు గెలిచింది. సన్‌రైజర్స్ తొమ్మిది మ్యాచ్‌ల్లో గెలుపొందగా, కేకేఆర్ 18 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ జట్టును నాకౌట్ మ్యాచ్ లో విజయానికి చేర్చడంలో అపారమైన అనుభవం ఉంది. ఈరోజు కూడా అదే జోరు ప్రదర్శించి కేకేఆర్‌పై విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నారు. ఇదిలా ఉంటె ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ కావడంతో బెట్టింగ్‌ ముఠాలు రంగంలోకి దిగాయి. వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసి పందెం రాయుళ్లకు సమాచారం చేరవేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం, యాప్‌ల ద్వారా రూ.1000 నుంచి రూ.10 లక్షల వరకూ పందాలను ఆహ్వానిస్తున్నారు. దీంతో ఈసారి భారీ స్థాయిలోనే బెట్టింగులు జరుగుతాయని తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img