Homeహైదరాబాద్latest Newsఇదెక్కడి వింత.. వాట్సాప్ గ్రూప్ చూడట్లేదని టీచర్ సస్పెండ్..!

ఇదెక్కడి వింత.. వాట్సాప్ గ్రూప్ చూడట్లేదని టీచర్ సస్పెండ్..!

విజయవాడలో మొగల్రాజపురంలో వింత ఘటన చోటు చేసుకుంది. స్కూల్‌ వాట్సాప్‌ గ్రూప్‌ చూడట్లేదని టీచర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. విజయవాడలో జరిగిన ఈ సంఘటన వివాదాస్పదంగా మారింది. రమేష్ అనే ఉపాధ్యాయుడు వాట్సాప్ గ్రూప్‌లో యాక్టీవ్‌గా ఉండటం లేదని విద్యాశాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తనకు కంటి సమస్య ఉండటంతో స్మార్ట్‌ఫోన్‌ వాడొద్దని వైద్యులు చెప్పారని అతడు అంటున్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నాడని అతడిని సస్పెండ్ చేశారు. ఈ వివాదంపై డీఈవో యూవీ సుబ్బారావు స్పందించారు. రమేశ్‌కు కంటి సమస్య ఉందని వైద్యులు ఇచ్చిన సర్టిఫికెట్లు సమర్పించాలని కోరగా, స్పందించలేదని వారు తెలిపారు. అంతేకాదు విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వివరించారు. అందువల్లే క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని తెలిపారు.

Recent

- Advertisment -spot_img