ముంబైలోని తాజాగా దారుణం జరిగింది. ఒడిశాకు చెందిన రాజేష్ రాణా(28), ముంబైలో కూలీగా ఉన్నాడు. అదే రాష్ట్రానికి చెందిన రింకీ (23) అనే మహిళ తన ఏడాదిన్నర బిడ్డతో కలిసి ముంబైలో ఉంటుంది. రోజువారీ పని నిమిత్తం ఆమె రాజేష్‌ను కలిసింది. దీంతో వారిద్దరూ ఇష్టపడి సహజీవనం చేస్తున్నారు. అయితే వారిద్దరి మధ్య చిన్నారి అడ్డుగా ఉందని చంపేసి కాలువలో పడేశారు. అనంతరం చిన్నారి కిడ్నాప్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు రాజేష్, రింకీని అరెస్ట్ చేశారు.