Homeహైదరాబాద్latest NewsBengaluru Rave Party Case: నటి హేమను విచారణ రమ్మన్న సీసీబీ.. హాజరు కాలేను అని...

Bengaluru Rave Party Case: నటి హేమను విచారణ రమ్మన్న సీసీబీ.. హాజరు కాలేను అని తెగేసి చెప్పేసిన హేమ

బెంగుళూరు రేవ్ పార్టీ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న 8 మందికి సీసీబీ నోటీసులు జారీ చేసింది. నేడు బెంగళూరు సీసీబీ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇవాళ నటి హేమ సహా 8 మందిని సీసీబీ విచారించనుంది. విచారణకు రాని పక్షంలో కేసు తీవ్రత పెరిగే అవకాశం ఉంది. అయితే నటి హేమ సీసీబీ అధికారులకు లేఖ రాశారు. తను వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నందున విచారణకు హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. సీసీబీ ఎదుట హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని కోరారు. దీంతో మరోసారి హేమకు నోటీసులు ఇచ్చేందుకు సీసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు.

Recent

- Advertisment -spot_img