నేడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ నాయకులు ఓ పోలింగ్ బూత్ వద్ద డబ్బులు పంచుతూ బీజేపీ నాయకులకి చిక్కారు. పోలింగ్ రోజు హన్మకొండలోని ఓ పోలింగ్ బూత్‌లో బీఆర్ఎస్ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వచ్చి పోలింగ్ బూత్ సమీపంలోని బీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడి నుండి పంపించేశారు.