డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న చిత్రం “పుష్ప 2 ది రూల్”. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కు నేషనల్ వైడ్ గా సెన్సేషనల్ వైడ్ మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ‘పుష్ప-2’ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ‘పుష్ప-3’గురించి టాలీవుడ్లో ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. ‘పుష్ప-3’విషయంలో ‘కేజీయఫ్’ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోంది. ‘కేజీయఫ్-2’తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యశ్ వేరే సినిమాలు చేస్తున్నారు. ‘పుష్ప2’ తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ వేరే సినిమాలు చేసే అవకాశముంది. ఈ లెక్కన ‘కేజీయఫ్-3’, ‘పుష్ప-3’కి ఇంకా మూడేళ్లు పట్టొచ్చు.