Homeహైదరాబాద్latest Newsతెలుగు జాతి స్ఫూర్తి.. కీర్తి ఎన్టీఆర్

తెలుగు జాతి స్ఫూర్తి.. కీర్తి ఎన్టీఆర్


– టీడీపీ చీఫ్​ చంద్రబాబు
– దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రముఖల నివాళులు

ఇదే నిజం, తెలంగాణ/ఏపీ బ్యూరో: తెలుగు జాతి స్ఫూర్తి.. కీర్తి ఎన్టీఆర్ అని టీడీపీ అధినేత చంద్రబాబు కొనియాడారు. దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌ 101వ జయంతి సందర్భంగా చంద్రబాబు నివాళులర్పించారు. అన్నగారి సేవలను స్మరించుకుందామని శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ‘క్రమశిక్షణ, పట్టుదల, చిత్తశుద్ధి, ప్రజలకు మంచి చేయాలనే తపనే ఒక సామాన్య రైతు బిడ్డ అయిన తారక రాముడిని మహా నాయకునిగా తీర్చిదిద్దాయి. ‘సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు’ అని నమ్మిన ఎన్టీఆర్.. తెలుగుదేశం పార్టీ స్థాపనతో దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారు. అన్ని వర్గాలకు ఆత్మబంధువు అయ్యారు. ఆయన జయంతి సందర్భంగా ప్రతి అడుగూ ప్రజల కోసం అనే సంకల్పం తీసుకుందాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ శైలి అజరామరమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కొనియాడారు. ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ‘తెలుగు నుడికారానికి, తెలుగు నేలకు, తెలుగు జాతికి మరింత సొబగులు అద్దినవారిలో మన ఎన్టీఆర్‌ ఒకరని తెలుగువారు గర్వంగా చెప్పుకోవచ్చు. అలాంటి గొప్ప వ్యక్తి జయంతి సందర్భంగా అంజలి ఘటిస్తున్నాను’ అని పవన్‌ ట్విట్టర్​లో పోస్టు చేశారు.

ఎన్టీఆర్​ ఘాట్​ వద్ద నివాళులర్పించిన బాలకృష్ణ

ఎన్టీఆర్‌ 101వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ నేతలు నివాళులర్పించారు. హైదరాబాద్​లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన కుమారులు నందమూరి బాలకృష్ణ, నందమూరి రామకృష్ణ, టీడీపీ సీనియర్‌ నేత బక్కని నర్సింహులు అంజలి ఘటించారు. ఎన్టీఆర్ ఆయన మనవళ్లు జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ అంజలి ఘటించారు. తెల్లవారుజామునే ఘాట్‌ వద్దకు చేరుకుని తాతను స్మరించుకున్నారు.

Recent

- Advertisment -spot_img