రోహిత్ శర్మ తర్వాత టీమిండియాకు కెప్టెన్ ఎవరు అవుతారనే ప్రశ్నకు భారత మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత తదుపరి కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ అవుతాడని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. జట్టును హ్యాండిల్ చేసే అన్ని లక్షణాలు అయ్యర్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. త్వరలోనే తన ఫిట్నెస్ నిరూపించుకుని జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇస్తాడని ఉతప్ప వెల్లడించారు.