తెలంగాణ రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల మద్యం అందుబాటులోకి రానున్న సంగతి మనకు తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సోమ్ డిస్టిల్లరీస్కు అనుమతి ఇచ్చింది. అతి త్వరలోనే ఈ కొత్త బీర్లు మార్కెట్లోకి రానున్నాయి. సోమ్ డిస్టిల్లరీస్ నుంచి పవర్ 1000, బ్లాక్ ఫోర్ట్, హంటర్, వుడ్ పెకర్ బీర్లు తెలంగాణ మద్యం షాపుల్లో త్వరలో అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ కొత్త బ్రాండ్ల మద్యం విక్రయాలపై విపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ప్రవేశపెట్టి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ మండిపడ్డారు. తెలంగాణలో మద్యం అమ్మడానికి ఎవరికి అనుమతులు ఇవ్వలేదని ఓవైపు మంత్రి జూపల్లి ప్రకటించగా.. మరోవైపు సోమ్ డిస్టిల్లరీస్ అనే సంస్థ తెలంగాణలో కార్యకలాపాలు ప్రారంభిస్తున్నామని ప్రకటించిందన్నారు.