ఇదేనిజం, నిజామాబాద్ ప్రతినిధి: ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి పడి హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ మృతి చెందిన ఘటన నిజామాబాద్ లో జరిగింది. అయిదో టౌన్ పరిధిలోని వర్ని రోడ్ సాయినగర్‌లో నివాసముంటున్న శ్రీనివాస్(57) ఇందల్వాయి పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్నాడు. తన ఇంటి పైన మూడో ఫ్లోర్ నిర్మాణంలో ఉండగా.. మంగళవారం రాత్రి వాటర్ కొట్టేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు మూడో అంతస్తు నుంచి జారి పడ్డాడు. తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు అయిదో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.