Homeహైదరాబాద్latest Newsసేవారత్న జాతీయ అవార్డుకు ఎంపికైన కృష్ణచారి

సేవారత్న జాతీయ అవార్డుకు ఎంపికైన కృష్ణచారి

ఇదే నిజం దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గం, చందంపేట మండలంలోని చిత్రియాల గ్రామానికి చెందిన కూరేళ్ళ కృష్ణచారి గతం 10 సంవత్సరాలగా లయన్స్ క్లబ్, స్వర్నకారుల ,బీసీ సంఘం లో అనేక రకాల పదవులు చేస్తూ ప్రజలకు సేవ చేస్తూ నిత్యం సమాజ సేవ చేసినందుకుగాను గుర్తించి బహుజన సాహిత్య అకాడమీ జాతీయ చైర్మన్ నల్ల రాధాకృష్ణ మరియు నల్లగొండ జిల్లా సెలెక్టెడ్ కమిటీ జిల్లా చైర్మన్ డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ అవార్డును ఎన్నిక చేశారు. ఎన్నిక చేసినందుకుగాను కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డును హైదరాబాద్లోనే బహుజన సాహితీ అకాడమీ జాతీయ కార్యాలయంలో అందజేశారు. ఈ సంవత్సరం జూన్ 10వ తేదీన మహారాష్ట్రలోని పూణేల నిర్వహించే బహుజన రైటర్స్ నాలుగవ సమావేశం సందర్భంగా సేవారత్న జాతీయ అవార్డును అందజేయ నున్నట్టు తెలిపారు. వెస్టర్న్ ఇండియాలోని ఈ కాన్ఫరెన్స్ లో మహారాష్ట్ర,మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, గోవా రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది డెలిగేట్స్ హాజరవుతారని తెలిపారు. బహుజన అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలిపారు. నాపై నమ్మకం ఉంచి అవార్డును సెలెక్ట్ చేసినందుకుగాను మరింత ఉత్సాహంతో పనిచేసి ప్రజలకు సేవ చేస్తానని కూరేళ్ళ కృష్ణచారి తెలిపారు.

Recent

- Advertisment -spot_img