సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడనున్న సంగతి తెలిసిందే. ఈ ఫలితాలను మహారాష్ట్రలోని కొన్ని సినిమా థియేటర్లు ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సిద్ధమయ్యాయి. ముంబయిలోని ఎస్‌ఎం5 కల్యాణ్, సియాన్, కంజూర్‌మార్గ్‌లోని మూవీమ్యాక్స్ థియేటర్లు, థాణెలోని ఎటర్నిటీ మాల్, వండర్ మాల్, నాగ్‌పుర్‌లోని మూవీమ్యాక్స్ ఎటర్నిటీ, పుణెలోని మూవీమ్యాక్స్ తదితర థియేటర్లు ఎన్నికల ఫలితాలను పెద్ద స్క్రీన్‌పై ప్రసారం చేయనున్నాయి.