– జూన్ 13 వరకు అరెస్టు చేయొద్దని ఆదేశం
ఇదేనిజం, కరీంనగర్ టౌన్ : కరీంనగర్ ఎంఐఎం నాయకుడు, మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీకి హైకోర్టులో భారీ ఊరట లభించింది. మే 14న దళిత యువకుడిపై దాడి అంశంలో అబ్బాస్ సమీతోపాటు పలువురిపై కొత్తపల్లి హవేలీ పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఈ కేసులో ఏ5గా అబ్బాస్ సమీ ఉన్నారు. కొన్ని రోజులుగా అబ్బా సమీ పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నారు. ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ధర్మాసనం జూన్ 13 వరకు అబ్బాస్ సమీని అరెస్టు చేయొద్దని కొత్తపల్లి పోలీసులను ఆదేశించింది.