Homeహైదరాబాద్latest NewsALERT: వాహనదారులకు షాక్.. భారీగా పెరిగిన టోల్ ఛార్జీలు.. నేటి నుంచే అమలు..!

ALERT: వాహనదారులకు షాక్.. భారీగా పెరిగిన టోల్ ఛార్జీలు.. నేటి నుంచే అమలు..!

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రజలకు పెద్ద షాకిచ్చింది. దేశవ్యాప్తంగా టోల్ పన్నును పెంచింది. ఇవాళ్టి నుంచి అన్ని టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు 5 శాతం అదనంగా టోల్ ట్యాక్స్‌ను వసూలు చేస్తోంది. అయితే, ద్విచక్ర వాహన చోదకులకు టోల్ రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. ఏటా టోల్ రేట్లను పెంచడాన్ని ప్రతిపక్షాలు, పలువురు వాహనదారులు వ్యతిరేకిస్తున్నారు.

కొత్త టోల్ ఛార్జీల వివరాలు..
పెంచిన టోల్ ఛార్జీల ధరలు 2025 మార్చి 31 వరకు అమలులో ఉంటాయి.

  • కారు, జీపు, వ్యాను, ఎల్ఎంవీ, ఎస్ యూవీ, ఎంపీ వాహనాలకు ప్రతి కి.మీ.కి రూ.2.34 వసూలు చేస్తారు.
  • ఎల్సీవీ, మినీ బస్సులకు కి.మీ.కి రూ.3.77
  • బస్సు, 2 యాక్సిల్ ట్రక్కులకు కి.మీ.కి రూ.6.69, 3
  • యాక్సిల్ వాణిజ్య వాహనాలకు కి.మీ.కి రూ.8.63
  • భారీ నిర్మాణ యంత్రాలు, ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్, 4, 5, 6 యాక్సిల్ ట్రక్కులకు కి.మీ.కి రూ.12.40
  • భారీ వాహనాల(ఏడు అంతకంటే ఎక్కువ యాక్సిల్స్)కు కి.మీ.కి రూ.15.09

Recent

- Advertisment -spot_img