Homeహైదరాబాద్latest Newsఏపీలో బాబు సీఎం అయితే..తెలంగాణకు నష్టమా?

ఏపీలో బాబు సీఎం అయితే..తెలంగాణకు నష్టమా?

కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారన్నదానికంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లో విజయం ఎవరిది అన్నదానిపైనే తెలుగు ప్రజలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఏపీ ఊసే. కూటమి అధికారంలోకి వస్తుందని కొందరు అంటుంటే.. వైసీపీ మరోసారి పగ్గాలు చేపడుతుందని మరికొందరు భావిస్తున్నారు. నాయకుల కంటే ఎక్కువగా ప్రజల్లోనే ఎక్కువగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌కు కూడా ఇంత హడావిడి ఉండదేమో!

ఈ నేపథ్యంలోనే భిన్న సర్వే సంస్థలు వివిధ రకాలుగా తమ అభిప్రాయాన్ని చెప్పాయి. ఆరా మస్తాన్ సర్వే ప్రకారం వైసీపీ అధికారంలోకి..చాణక్య సర్వే ప్రకారం కూటమి అధికారంలోకి రానున్నాయి. ఈ సర్వేల ప్రకారం ఏపీలో ఫైట్ టఫ్‌గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ తర్వాత తెలంగాణ, కేంద్రంలో స్థానాల విషయంలో ఒక స్పష్టత వచ్చినప్పటికీ ఏపీ విషయంలో మాత్రం టెన్షన్.

ప్రముఖ సర్వే సంస్థ ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే ప్రకారం ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే చంద్రబాబు నాయుడు సీఎంగా, పవన్ కల్యాణ్ డిప్యుటీ సీఎంగా ఉంటారని అంతా అనుకుంటున్నారు.

తెలంగాణ ప్రజలు మాత్రం కొందరు ఏపీలో వైసీపీ రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి. ఇద్దరూ కలిసి హైదరాబాద్‌ను లూటీ చేస్తారని టాక్. తెలంగాణ మళ్లీ ఆంధ్ర నాయకుల చెప్పుచేతల్లోకి వెళ్తుందని ఆందోళన చెందుతున్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో తెలంగాణ ప్రజలకు మళ్లీ అన్యాయం జరిగే అవకాశం ఉందని అనుకుంటున్నారు. నీళ్లు, నిధులను మళ్లీ ఏపీకి తరలిస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి విషయాల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తెలంగాణకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. ముప్పు లేకుండా ఉంటే చాలు. అక్కడి ప్రజల అవసరాలకు అనుగుణంగా నాయకులు వ్యవహరించి అభివృద్ది చేస్తే రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు సంతోషంగా ఉంటారు. ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడితే ఊరుకోరు. ఉద్యమాలు చేసి గద్దె దింపుతారు. ఎంతకైనా తెగిస్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సకాలంలో అమలు చేయాలి. గత ప్రభుత్వం అమలుచేసిన పథకాలను పక్కాగా అమలు చేయాల్సిందే.

Recent

- Advertisment -spot_img