Homeహైదరాబాద్latest Newsగాలివాన బీభత్సం..గ్రామం అతలాకుతలం..!

గాలివాన బీభత్సం..గ్రామం అతలాకుతలం..!

ఇదేనిజం, కంగ్టి: సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం చాప్ట(కె )గ్రామంలో ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో గాలివానతో కూడిన భారీ వర్షం గ్రామ ప్రజలను అతలాకూతలం చేసింది. పెద్ద ఎత్తున గాలిదుమారం లేవడంతో చెట్లు కూలిపోగా, ఇంటిపై ఉన్న కప్పు రేకులు గాల్లో లేచిపోయాయి. కాలనిలో మూడు విద్యుత్‌ స్తంభలు నెలకొరిగాయి. ఒకరి ద్విచక్ర వాహనంపై చెట్టు కూలడంతో బైక్‌ దెబ్బతింది. ఇంటి గోడల రాళ్లు కూలి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సంగారెడ్డి ప్రభుత్వం ఆసుపత్రి కి తరలించారు.రాత్రంతా కరెంటు లేక చాప్ట గ్రమం అంత చీకటిలో ఉండిపోయారు.

Recent

- Advertisment -spot_img