రేపటి కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.జూన్ 4న ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్, 8.30 నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈసారి పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువగా వచ్చాయి. వీటికి ప్రత్యేక కౌంటర్లు ఉంటాయని తెలుస్తుంది. అయితే ఒకవేళ కౌంటింగ్ సమయంలో కూడా కొన్ని ఈవీఎంలు మొరాయిస్తే.. అప్పుడు వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తారు. అభ్యర్థుల గుర్తుల వారీగా బాక్సులు ఏర్పాటు చేసి, వారికి పోలైన స్లిప్పులను అందులో వేస్తారు. ఆ తర్వాత లెక్కిస్తారు. ఒక్కో వీవీ ప్యాట్ యంత్రంలోని స్లిప్పులు లెక్కబెట్టాలంటే దాదాపు గంట పడుతుంది. అయితే వీవీప్యాట్‌లు లెక్కించాల్సి వస్తే.. అన్నీ ఒకేసారి ఓపెన్ చేయరు. ఒకదాని తర్వాత మరొకటి తెరిచి లెక్కిస్తారు.