చాలా మందికి కొన్ని ఆహారాలు తినడం వల్ల చాలా మందికి జీర్ణ సమస్యలు వస్తాయి. కానీ..కొంతమందికి కొంచెం కూడా తిన్నాక బరువుగా అనిపిస్తుంది. ఈ జీర్ణ సమస్యలను తగ్గించుకోవాలంటే మనం ఆహారంలో కొన్ని ఆహారాలను చేర్చుకుంటే చాలు అవి ఏంటో ఎప్పుడు తెలుసుకుందాం..
- జీర్ణ సమస్యలకు అల్లం ఒక అద్భుతమైన ఔషధం. అల్లంలో ఉండే జింజెరాల్ దీనికి సహకరిస్తుంది. ఇది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది.
- మజ్జిగలో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మజ్జిగ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పేగు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే పొట్ట సుఖంగా ఉంటుంది.
- నెయ్యి తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఇవి కండరాల ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తికి మేలు చేస్తాయి. అలాగే తీసుకున్న ఆహారం కూడా సులభంగా జీర్ణమవుతుంది.
- ఉల్లిపాయలు మన శరీరానికి అవసరమైన బ్యాక్టీరియాతో రక్షణ కల్పిస్తాయి. ఇది జీర్ణక్రియను సులభతరం చేయడంలో కూడా సహాయపడుతుంది. కాబట్టి ఉల్లిపాయను కూడా ఆహారంలో చేర్చుకోవచ్చని తెలుస్తుంది.