Homeహైదరాబాద్latest Newsరాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అంబటి రాయుడు..!

రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అంబటి రాయుడు..!

ఏపీలో జరుగుతున్న ఓట్ల లెక్కింపులో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా కూటమికి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ చేతులు కలిపారని చెప్పారు. వారి నాయకత్వంలో రాష్ట్రానికి మంచి రోజులు రానున్నాయన్నారు. నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర కూటమి విజయంలో ప్రధాన పాత్ర పోషించిందని ఆయన పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img