Homeహైదరాబాద్latest Newsఒక పోటీ అయిపోగానే ఇంకొకటి..కేంద్రమంత్రి పదవి దక్కేదెవరికి?

ఒక పోటీ అయిపోగానే ఇంకొకటి..కేంద్రమంత్రి పదవి దక్కేదెవరికి?

రాష్ట్రంలో కాషాయ జెండా రెపరెపలాడింది. మొత్తం 8 లోక్‌సభ స్థానాలు గెలుచుకొని పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇది ప్రోత్సాహంగా ఉండనుంది. అయితే గెలిచినవారిలో కేంద్రమంత్రి పదవి ఎవరికి ఇస్తారు? రాష్ట్రం నుంచి ఎంతమంది కేంద్రమంత్రులుగా ఎంపిక అవుతారు అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మల్కాజ్‌గిరి నుంచి ఈటల రాజేందర్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి,మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణ వంటి సీనియర్ నాయకులు కేంద్రపదవిపై ధీమాగా ఉన్నారు. అదేవిధంగా ధర్మపురి అరవింద్, బండి సంజయ్, కిషన్ రెడ్డి లో ఒకరికి మంత్రి పదవి ఇచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. జూన్ 8 న దిల్లీలోని కర్తవ్యపథ్‌లో మోదీ ప్రమాణ స్వీకారం జరగనుంది. మంత్రివర్గం కూడా కొలువుదీరే అవకాశం ఉంది.

Recent

- Advertisment -spot_img