ఎట్టకేలకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచారు. పదేళ్లపాటు పోరాడిన పవన్ కల్యాణ్ ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. దాడులు, ఆగడాలను సహించారు. చివరికి పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది తన సత్తా ఏంటో రాజకీయ, సినీ ప్రముఖులకు తెలిసేలా చాటిచెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కల్యాణ్ జగన్‌పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఫ్యాన్స్ పోస్టులు పెడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
‘జగన్ సామాన్యుడు రాజకీయం చేస్తే ఇలాగే ఉంటది. వ్యూహాలు వేస్తాం. పొత్తులు పెట్టుకుంటాం. నీ కోటలు బద్దలు కొడ్తాం. నెత్తిమీద కాలేసి తొక్కుతాం కదా. అప్పుడు అర్థమవుతుంది మేమేంటో. జగన్ గుర్తు పెట్టుకో అథ:పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కల్యాణే కాదు. నా పార్టీ జనసేనే కాదు” – పవన్ కల్యాణ్