వన్డే వరల్డ్ కప్‌ను తృటిలో చేజార్చుకున్న టీమిండియా టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా బరిలో దిగనుంది. గ్రూప్-ఎలో భాగంగా ఈరోజు న్యూయార్క్ లోని నాసా కంట్రీ స్టేడియంలో ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ ఆడనుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ లకు ఈ టీ20 ప్రపంచకప్ చాలా ప్రత్యేకం. భారత జట్టు కోచ్‌గా ద్రవిడ్‌కి ఇదే చివరి మిషన్… అలాగే మరోవైపు, 37 ఏళ్ల రోహిత్ కెరీర్‌లో ఇదే చివరి టీ20 కప్‌గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో టైటిల్‌తో గ్రాండ్‌గా వీడ్కోలు పలకాలని ఇద్దరూ భావిస్తున్నారు. ఈరోజు చిన్న జట్లలో పెద్ద జట్టు అయిన ఐర్లాండ్‌తో భారత్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం లాంఛనమే అనిపిస్తున్న.. గతంలోప్రపంచకప్‌లలో పెద్ద జట్లకు షాకిచ్చిన ఐర్లాండ్‌ను తక్కువ అంచనా వేస్తే అంతే సంగతులని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే 20 దేశాలు అత్యంత పొట్టి కప్‌లో పోటీపడుతున్నాయి. నాలుగు గ్రూపులుగా విడిపోయి సూపర్-8 బెర్త్ కోసం పోటీ పడుతున్నారు. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి.