ఇదేనిజం, వెబ్‌డెస్క్ : ఒకప్పుడు ట్రాకే లేని సమయంలో జంపులు, పల్టీలు కొట్టుకుంటూ రేసింగ్ విన్ అయిన కార్ ప్రస్తుతం మొరాయిస్తోంది. స్పీడు 88 నుంచి 39కి, 39 నుంచి 0కి పడిపోయింది. కదలనంటూ మొండికేస్తోంది. ఫ్యూయల్ అయిపోయిందా? స్పేర్ పార్ట్స్ ఏమైనా రిపేర్ ఒచ్చాయా? లేదా యాక్సిడెంట్ ఏమైనా జరిగిందా? ఇవన్నీ గాక డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిందా? డాక్యుమెంట్స్ అన్నీ సరిగానే ఉన్నాయే! డ్రైవర్ కూడా సీనియర్ ఏ. కానీ ఏమైందో తెలియదు కారు మాత్రం ఆగింది. నెడుతున్నా కదలడం లేదు ఎందుకో. ఎన్నో రేస్ లను ఛేదించిన ఈ కారు ఇప్పుడెందుకు చతికిలపడింది. మోకాలెత్తున్నోడెవడైనా అడ్డుగా ఉన్నాడా? ఉంటే డ్రైవర్‌కు కనబడ్తలేదా. ఎక్కియ్యచ్చు కదా. లేదా పక్కకు జరిగైనా పోవాల్నే. అసలు కారుకు ఏమైంది? అంతుచిక్కడం లేదు. Shhhhh…
సరే జరిగిందేదో జరిగింది. మళ్ళీ జరగబోయే రేస్ లో ఈ కార్ దూసుకెళ్లాలని ఉంది. విన్ అయితే చూడాలని ఉంది. అందుకు కొత్తగా మేకప్ చేస్తారా? లేదంటే టెస్లా లాంటి కొత్త కార్ కొంటారా? ఏం చేస్తారో తెలియదు. రేసింగ్ టైం కి మాత్రం కార్ రెడీ గా ఉండాలి. దెబ్బకు దుమ్ములేచిపోవాలి. విన్ అయి మెడల్ కొట్టాలి. ట్రాక్ మేం సిద్ధం చేస్తాం అంటున్నారు ఆడియన్స్. ప్లీజ్ ఈ ఒక్క రేస్. మళ్ళీ మీలో ఉన్న రేసర్‌ను తలుచుకోండి. రెడీ అవ్వండి. మీతోని అయితది. సైకిల్ ఏ ఈ స్పీడ్ లో వెళ్తే..మనది కార్ సార్..రయ్ మని దూసుకెళ్తే కంటికి కనిపించొద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఒకవేళ కొత్తకార్ కొంటే ఇదివరకు దిగినోళ్లను ఎక్కించుకోవద్దు భయ్..మరకలు అయితయ్ అంటూ సజెస్టింగ్. చూద్దాం. కారే తెస్తాడా? లేదంటే హెలికాప్టరే పట్టుకొని దిగుతడా? కానీ రావడం మాత్రం పక్కానట.