వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇకపై జగన్ కోర్టుకు హాజరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా పరిపాలనపరమైన బాధ్యతల కారణంతో ఆయన ఇన్నాళ్లూ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందుతూ వచ్చారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోవడంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఇకపై ప్రతి శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్ హాజరవ్వక తప్పని పరిస్థితి ఉంది.