ఇదే నిజం, కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం పరిధిలోని బాలాజీ లే అవుట్ లో గత కొన్ని రోజులుగా రోడ్డుపై మురుగునీరు పొంగి పొర్లుతుంది. కాలనీలోని వర్షాకాలం వచ్చిన ప్రతీ సారీ డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిని రోడ్డుపై పొంగి పోర్లుతుంది. అటుగా వెళ్తున్న పాదచారులు, వాహనదారులు ముక్కుపుటాలదిరేలా దుర్వాసన రావడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ పై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని స్థానికులు వాపోతున్నారు. మురుగు నీరు రోడ్డుపై పారుతున్నా మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వస్తున్నాయి. మ్యాన్ హోల్ నుంచి మురుగు నీరు లీకవుతూ రోడ్డుపై పారుతున్నాయి. దీనికి తోడు వర్షాకాలం కావడంతో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు మున్సిపల్ అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.