హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఎస్‌ఆర్ నగర్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, హయత్ నగర్, వస్థలిపురం, ఎల్బీ నగర్, మలక్ పేట, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సహా పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. తెలంగాణలో రెండు రోజులు వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఇక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.