సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు, విడాకులు సర్వసాధారణం…చాలా మంది తారలు పెళ్లి చేసుకున్నంత త్వరగా విడాకులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో కొందరు తారలు రెండో పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే వీరి మొదటి పెళ్లి ఎలా జరిగిందో చాలా మందికి తెలియదు. ముఖ్యంగా లక్ష్మి మొదటి భర్తకు సంబంధించిన వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్‌లోని చాలా మంది సెలబ్రిటీల మాదిరిగానే మంచు లక్ష్మి కూడా తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చింది. మంచు లక్ష్మి మొదటి భర్త, మొదటి పెళ్లి గురించి చాలా మందికి తెలియదు. మంచు లక్ష్మి చదువుకునే సమయంలో కాలేజీ స్నేహితుడైన ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది.
వీరి ప్రేమను మంచు మోహన్ బాబు తిరస్కరించడంతో.. మంచు లక్ష్మి ఆగ్రహం తో బయటకు వెళ్లి పెళ్లి చేసుకుంది. మోహన్ బాబు ఊర్లో లేని టైమ్ లో.. ఎవరికీ చెప్పకుండా ఆర్య సమాజంలో ప్రేమించిన శ్రీనివాస్ ను పెళ్లి చేసుకుంది.అయితే ఆతరువాత తన ప్రేమ, పెళ్లికి బ్రేకప్ చెప్పి.. మంచు లక్ష్మి తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చింది. అయితే ఈ విడాకుల వెనుక మోహన్ బాబు హస్తం ఉందనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. అయితే లక్ష్మి ప్రేమ వార్తలపై కొన్ని నిజాలు ఉన్నాయి. అలాగే కొన్ని పుకార్లు ఉన్నాయి. ఆమె ఎందుకు విడాకులు తీసుకుందనే విషయంపై క్లారిటీ లేదు.