Sarpanch Suspicious Death
ఊహించని ఎన్నికల ఫలితాల వల్ల ఏలూరు జిల్లా నూజివీడు సర్పంచ్ తనువు చాలించాడు. దాదాపు రూ. 30 కోట్ల వరకూ బెట్టింగ్ లావాదేవీల్లో ఆయన మధ్యవర్తిగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచీ వేణుగోపాల్ రెడ్డి కనిపించడంలేదని అయన సతీమణి విజయ లక్ష్మి తెలిపింది. రెండు రోజుల క్రితం బెట్టింగ్ ముఠా వేణు ఇంటిపై దాడికి దిగారు. ఈ క్రమంలోనే ఆయన అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.