Actual Meaning of Cabinet
ఇదేనిజం, వెబ్‌డెస్క్ : క్యాబినెట్‌కు, మంత్రిమండలికి చాలా తేడా ఉంది. క్యాబినెట్ అనేది మంత్రిమండలిలో ఒక కీలక భాగం. కేవలం మంత్రి పదవి రాగానే క్యాబినెట్‌లో చోటు దక్కినట్టు కాదు. ప్రభుత్వ విధానాలు, పాలసీల రూపకల్పన వంటి కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు మంత్రిమండలిలోని ఒక వర్గాన్ని క్యాబినెట్ అంటారు. కొత్త పథకాలు, నిధుల విడుదల, క్లిష్ట పరిస్థితుల్లో పరిష్కారాలు, వ్యూహాత్మక నిర్ణయాలు, ప్రణాళికలు, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాల పైన సుదీర్ఘ చర్చలకు క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేస్తారు. మంత్రిమండలిలోని సభ్యులందరూ ఇందులో ఉండరు. సుదీర్ఘ అనుభవం, తెలివితేటలు ఉన్నావారికే ఎక్కువగా అవకాశం ఉంటుంది.
శాసనసభలో గానీ, లోక్‌సభలో గానీ మొత్తం సభ్యుల సంఖ్యలో 15 శాతానికి మించకుండా మంత్రుల సంఖ్య ఉండాలన్న నిబంధన భారత రాజ్యాంగంలో ఉంది. ఉదాహరణకు తెలంగాణలో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 119. ఇందులో 15 శాతం అంటే గరిష్టంగా 18 మంది మంత్రులుగా ఉండవచ్చు. ఇందులో క్యాబినెట్ భేటీలో పాల్గొనేది కేవలం సీనియర్ నాయకులు, మంత్రులు మాత్రమే. వారు దాదాపుగా 6 నుంచి 10 మంది దాకా ఉండే అవకాశం ఉంది.