ఇదే నిజం: ముస్తాబాద్ మండల కేంద్రంలో మున్నూరు కాపు మండల అధ్యక్షులు మెంగని. రాజు పటేల్ ఆధ్వర్యంలో మున్నూరుకాపు ఆత్మీయ సమ్మేళనం ఎఎంఆర్ గార్డెన్ లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు సమావేశంలో పాల్గొని నూతనంగా ఎన్నికైన మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులు కార్యవర్గం ను శాలువలతో సత్కరించారు అలాగే జిల్లా నాయకులు మండల కార్యవర్గాన్ని సన్మానించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ మున్నూరు కాపు కుల బాంధవులు ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం కావాలని రానున్న స్థానిక ఎన్నికల్లో అందరూ ఐక్యతగా ఉండి విజయాలు సాధించాలని అన్నారు మున్నూరు కాపులు వెనుకబడిన నిరుపేదలకు ఆర్థిక సహాయంతో పాటు వారు ఎదుగుదలకు తోడ్పడాలని పిలుపునిచ్చారు మన కుల బాంధవుల సమస్యలు మనం మనమే పరిష్కరించుకోవాలని అన్నారు మున్నూరు కాపు కార్పొరేషన్ ద్వారా మన పిల్లలకు సహాయ సహకారాలు అందించి అన్నిట్లల్లో ముందుండి మన స్థానిక ఎంపీ బండి సంజయ్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సహాయ సహకారాలతో సమస్యలను పరిష్కరించుకోవాలని సంఘ అభివృద్ధికి ప్రతి ఒక్కరు తోడ్పడాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బొప్ప దేవయ్య మండల మున్నూరు కాపు అధ్యక్షులు మెంగని. రాజు పటేల్ . జిల్లా కార్యవర్గ సభ్యులు శంకర్ తిరుపతి పోశెట్టి మండల కార్యవర్గ సభ్యులు గొప్ప నరసయ్య అల్లం లక్ష్మణ్ మహేందర్ దేవేందర్ స్వామి మనోహర్ ధర్మేందర్ లక్ష్మణ్ మహిళ నాయకురాలు బొప్ప విజయలక్ష్మి. స్వర్ణ .బాలలక్ష్మి. అన్ని గ్రామాల మున్నూరు కాపు అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.