ఇదే నిజం, నిజాంపేట్: నిజాంపేట్ మండల కేంద్రంలోని పల్లె దవాఖానకు ఆరు నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో మంగళవారం ఇంటి యజమాని తాళం వేశారు. దీంతో బీపి,షుగర్, రోగులకు, మరియు గర్భిణీలకు వైద్యం అందిచలేక రోడ్డు పైన కూర్చునే పరిస్థితి ఏర్పడింది. పల్లె దవాఖాన నూతన భవనం ఏర్పాటు చేసి ఏడాది గడుస్తున్న అధికారుల నిర్లక్ష్యం వల్లన అందుబాటులోకి తీసుకురాలేకపోతున్నారానీ గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా ఉన్నత అధికారులు స్పందించి పల్లె దవాఖానను అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.