Homeహైదరాబాద్latest Newsబడిబాట కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

బడిబాట కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ కేంద్రంలోనీ స్థానిక ZPHS స్కూల్ లో బుధవారం రోజున నిర్వహించిన బడి బాట కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ దివాకరన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఉన్నాయని,శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో బోధన అందించడం జరుగుతుందని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యహ్నం భోజనంతో పాటు, టెక్స్ట్ బుక్స్,యునిఫామ్స్ తో పాటు స్కాలర్‌షిప్‌ అవకాశం కూడా ఉంటుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, ధర్మపురి ZPHS స్కూల్ నీ నేను మొదటి సారి సందర్శించినప్పుడు స్కూల్ ప్రిన్సిపల్ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, నీటి సదుపాయం సరిగలేదని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని నా దృష్టికి తీసుకురావడం జరిగిందనీ, తాను ఎమ్మెల్యే గా గెలిచిన వెంటనే పాఠశాలకు బొర్ వేల్ నీ మంజూరు చేయడం జరిగిందని, నియోజక వర్గంలో ఉన్న ప్రతి పాఠశాలలో ఎటువంటి సమస్యలు ఉన్న వాటిని వెంటనే పరిష్కరిస్తామని, జగిత్యాల జిల్లాలో విద్య రంగ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సంగి సత్తమ్మ జడ్పిటిసి బత్తిని అరుణ ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు ఎమ్మార్వో ఎంఈఓ ఏపీఎం జిల్లా అధికారులు, మండల అధికారులు,ప్రజాప్రతినిధులు, పాఠశాల యాజమాన్యం, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img