ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంతో పాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ ఎవరు అనే చర్చ జరుగుతోంది. ఈ పదవి కోసం కొందరు టీడీపీ సీనియర్ నేతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్పీకర్ రేసులో కళా వెంకట్రావ్, చింతకాయల అయ్యన్నపాత్రుడు, కూన రవికుమార్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రఘురామకృష్ణరాజు, ధూళిపాళ్ల నరేంద్ర ఉన్నారు. త్వరలో దీనిపై స్పష్టత రానుంది.