Homeహైదరాబాద్latest NewsBREAKING: మళ్లీ జనంలోకి జగన్.. ఓదార్పు యాత్ర తరహాలో కొత్త ప్లాన్..?

BREAKING: మళ్లీ జనంలోకి జగన్.. ఓదార్పు యాత్ర తరహాలో కొత్త ప్లాన్..?

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి అఖండ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి జనాల్లోకి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గత ఎన్నికలకు ముందు ఓదార్పు యాత్ర చేసి..విజయం సాధించిన జగన్..ఇప్పుడు ఓటమి తర్వాత మరోసారి జనాల్లోకి వెళ్లేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తుంది. ఎన్నికల ఫలితాలకు ముందు తమదే అధికారమనే ధీమాలో ఉన్న వైసీపీ పార్టీ, ఆ పార్టీ అభిమానులు.. ఈ ఫలితాలతో ఒక్కసారిగా కుంగిపోయారు. మరోవైపు ఎన్నికల ఫలితాల తర్వాత పలుచోట్ల వైసీపీ కార్యకర్తల మీద పలుచోట్ల దాడులు జరుగుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నష్టపోయిన కార్యకర్తలను పరామర్శించేందుకు మరోసారి ఓదార్పు యాత్ర చేస్తారనే వార్తలు వస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img