Homeహైదరాబాద్latest Newsతమిళిసైకి అమిత్ షా వార్నింగ్? నిజమేనా?

తమిళిసైకి అమిత్ షా వార్నింగ్? నిజమేనా?

తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసైకి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వార్నింగ్ ఇచ్చారంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న అంశంపై క్లారిటీ వచ్చింది. ఈ నెల 12 న అమరావతిలోని కేసరపల్లిలో చంద్రబాబు ప్రమాణ స్వీకార సమయంలో ఇద్దరూ రాజకీయ అంశాల గురించి చర్చించుకున్నట్లు తమిళిసై స్పష్టం చేసింది. ఎన్నికల తర్వాత తమిళనాడులో పరిస్థితులపై అమిత్‌షా ఆరా తీసారని చెప్పారు. కౌంటింగ్ తరువాత ఎదుర్కొన్న సవాళ్ల గురించి అడగడానికి పిలిచారని తెలిపింది. రాష్ట్రంలో రాజకీయ స్థితిగతులు, నియోజకవర్గ సమస్యలు, చేపట్టాల్సిన పనులపై శ్రద్ధ వహించమని సలహా ఇచ్చారని పేర్కొన్నారు.

1406 Tamilisai ఇదేనిజం తమిళిసైకి అమిత్ షా వార్నింగ్? నిజమేనా?

ఈ సార్వత్రిక ఎన్నికల్లో తమిళసై సౌందరరాజన్ దక్షిణ చెన్నై లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేశారు. డీఎంకేకు చెందిన తమిజాచి తంగపాండియన్‌ చేతిలో ఓటమిపాలయ్యారు.

Recent

- Advertisment -spot_img