తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఆన్సర్ కీ ని టీజీపీఎస్సీ విడుదల చేసింది. మాస్టర్ ప్రశ్నపత్రాన్ని కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది.
టీజీపీఎస్సీ ఐడీ, హాల్టికెట్ నంబర్, పుట్టినరోజు వివరాలు అధికారిక వెబ్సైట్లో నమోదు చేసి ఆన్సర్ కీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ‘కీ’ పై అభ్యర్థుల అభ్యంతరాలను ఈ జూన్ 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించేందుకు అవకాశం కల్పించింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలు కేవలం ఇంగ్లిష్ భాషలో మాత్రమే స్వీకరించనున్నారు. ఇతర భాషలో వచ్చిన అభ్యంతరాలు, ఈ-మెయిల్, వ్యక్తిగతంగా వచ్చే అభ్యంతరాలను స్వీకరించ బోమని టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ స్పష్టం చేశారు.
కాగా మొత్తం 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడగా.. మొత్తం 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్ ప్రిలిమ్స్ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా 897 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. దాదాపు 3.02 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది ఆన్సర్ కీ రూపొందించి, ఆపై ఫలితాలను కూడా వెనువెంటనే ప్రకటిస్తారు. తదుపరి దశ అయిన మెయిన్స్ పరీక్షలను అక్టోబరు 21 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు.
Read More :
- T20 series : ఇంగ్లాండ్ 132 పరుగులకు ఆలౌట్.. ఇరగదీసిన టీమిండియా..!!
- Red Alert : శంషాబాద్ విమానాశ్రయానికి రెడ్ అలర్ట్.. !!
- Chevella : అభ్యంతరాలుంటే అధికారులకు చెప్పండి
- Chhaava : విక్కీ కౌశల్ ”ఛావా” మూవీ ట్రైలర్ రిలీజ్.. బాలీవుడ్ కి భారీ హిట్ కన్ఫర్మ్..!
- Trains : రైళ్లు ఆలస్యంగా నడవడానికి కారణం ఏంటో తెలుసా..?