ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకువస్తోంది. తాజాగా మరో 3 కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఒకేసారి 32 మందితో వీడియో కాల్ మాట్లాడొచ్చు. అలాగే స్క్రీన్ షేరింగ్ ఫీచర్ ఇకపై ఆడియోతో అందుబాటులోకి వస్తుంది. మెరుగైన ఆడియో, వీడియో నాణ్యతను అందించేందుకు MLow కోడెక్ ఫీచర్ను ఉపయోగిస్తున్నారు. ఇది వాయిస్ క్లారిటీతో పాటు హెచ్డీతో వీడియో కాల్ మాట్లాడే సదుపాయాన్ని అందిస్తుంది.