Homeహైదరాబాద్latest NewsT20 World Cup: నరాలు తెగే ఉత్కంఠ.. ఒక్క పరుగు తేడాతో గెలుపు..

T20 World Cup: నరాలు తెగే ఉత్కంఠ.. ఒక్క పరుగు తేడాతో గెలుపు..

T20 World Cup: దక్షిణాఫ్రికాను పసికూన నేపాల్ భయపెట్టింది. దాదాపు సంచలన విజయం నమోదు చేసేలా ఆఖరి బంతి వరకు పోరాడింది. కానీ ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. కింగ్స్‌టౌన్ వేదికగా నరాలు తేగే ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో అంతిమంగా నేపాల్‌పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. లీగ్ దశను సౌతాఫ్రికా అజేయంగా ముగించింది. ఈ మ్యాచ్‌లో నేపాల్‌పై సౌతాఫ్రికా 1 పరుగు తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 115/7 స్కోరు సాధించింది. ఛేదనలో నేపాల్ 114/7 స్కోరు మాత్రమే చేసి ఓటమి పాలైంది. చివరి ఓవర్‌లో నేపాల్‌కు 8 పరుగులు అవసరం అయ్యాయి. చివరి బంతికి నేపాల్ బ్యాటర్ గుల్స‌న్ జా రనౌట్ అయ్యాడు. అయితే చివరి బంతిని గుల్షాన్‌ బ్యాటుకు తాకించలేకపోయాడు. కానీ బై రూపంలో పరుగు తీయాలనుకున్న నేపాల్‌కు సౌతాఫ్రికా చెక్ పెట్టి ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.

Recent

- Advertisment -spot_img