వైసీపీ పాలనలో ఏపీ పౌరసరఫరాల సంస్థ కూడా నిర్వీర్యం అయిపోయింది. అడ్డగోలు నిర్ణయాల కారణంగా 5 ఏళ్ల కాలంలో సంస్థ అప్పులు రూ.40 వేల కోట్లకు చేరాయి. సంస్థకు అప్పు పుట్టే మార్గం లేక.. మార్క్ఫెడ్ తదితర సంస్థల ద్వారా రుణాలు తీసుకుని సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. నిత్యావసరాల సేకరణలో అడ్డగోలు అక్రమాలకు బరితెగించారు. కనీసం పేదలకు కందిపప్పు, జొన్నలు, రాగులు, గోధుమపిండి లాంటి నిత్యావసరాలు కూడా అందించలేదు.